JanSankalp Foundation’s Water Conservation Initiative

Yarraguntapalli Village, Anantapuram District

JanSankalp Foundation, through its dedicated efforts, is actively involved in water conservation in Yarraguntapalli village, located in Anantapuram district. An individual named Anand Yadav, a resident of the United States and a member of the JanSankalp Foundation Trust, initiated this project with the aim of addressing water-related challenges in the region and relieving the burden of water scarcity for the farming community. The Foundation members, including Anand Yadav, who hails from Maharashtra, renowned for its groundwater management, conducted various activities related to water conservation in the village. They visited the village extensively, interacted with local farmers, provided guidance on efficient water utilization, constructed water sheds to facilitate rainwater harvesting, and offered advice on irrigation methods using limited water resources. The suggestions and recommendations formulated by the Foundation’s team were compiled into a proposal, which serves as a valuable resource for future water conservation initiatives. Thanks to the collective efforts of the Foundation members, the farmers in the village now have access to adequate water for irrigation and agricultural needs, ensuring a brighter future for their crops. JanSankalp Foundation continues to support and encourage collaboration among farmers to promote sustainable agricultural practices and achieve the goal of water conservation in rural areas.

అనంతపురం జిల్లా ఎర్రగుంట పల్లి గ్రామంలో జల సంరక్షణకు సంకల్ప ఫౌండేషన్ కృషి చేస్తోంది. గ్రామంలో లో నెలకొన్న తాగునీరు, సాగునీరు ఎద్దడి నివారించడానికి గ్రామానికి చెందిన ఆనంద్ యాదవ్ అనే వ్యక్తి నడుం బిగించారు. పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడైన ఆనంద్ యాదవ్ సంకల్ప్ ఫౌండేషన్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి గ్రామంలో ఉద్యోగ కల్పన చేయడంతోపాటు జీవనోపాధి అయిన కరివేపాకు సాగుకు భవిష్యత్తులో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండడానికి తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాడు. కరువు జిల్లాగా పేరొందిన అనంతపురం జిల్లాలో భూగర్భ జలాలను పెంపొందించుకోవడానికి గాను మహారాష్ట్రకు చెందిన ఫౌండేషన్ అనే సంస్థ సభ్యులు ఆనంద్ యాదవ్ సూచనమేరకు గ్రామంలో జల సంరక్షణ పై చర్యలు చేపట్టారు. ముఖ్యంగా గ్రామంలోని రైతులు వర్షపు నీటిని ఎలా నిల్వ చేయాలి, వర్షపు నీరు నిల్వ ఉండే విధంగా వాటర్ షెడ్ల నిర్మాణం ఎలా చేపట్టాలి, తక్కువ నీటితో పంటల సాగు ఎలా చేపట్టాలి అనే తదితర అంశాల గురించి పౌండేషన్ ముగ్గురు సభ్యుల బృందం గ్రామంలో విస్తృతంగా పర్యటించి జల సంరక్షణ కొరకు తీసుకోవాల్సిన సలహాలు సూచనలను సంబంధించి ఒక నివేదికను తయారు చేశారు. వారు సూచించిన ప్రకారం భవిష్యత్తులో రైతులు చేపట్టినట్లయితే గ్రామంలో తాగునీరు మరియు సాగునీరు పుష్కలంగా లభించే అవకాశం ఉందని సంకల్ప్ ఫౌండేషన్ నిర్వాహకులు ఆనంద్ యాదవ్ తెలియజేశారు. సంకల్ప్ ఫౌండేషన్ గ్రామంలో చేపట్టనున్న వ్యవసాయ సంబంధమైన అంశాలకు కు, రైతులు సహకరించాల్సిందిగా ఒక ప్రకటనలో కోరారు.

Author

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

Latest Articles